గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణానికి 437 కోట్ల రూపాయల విడుదల కి క్యాబినెట్ ఆమోదం..
హుస్నాబాద్ పట్టణం లో మిన్నంటిన సంబరాలు
ఆనందంతో టపాసులు కాల్చి సీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ క్యాబినెట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల్లో భాగంగా భూసేకరణ, కాలువల నిర్మాణానికి 437 కోట్ల రూపాయల విడుదల కి క్యాబినెట్ ఆమోదం తెలపడం తో హుస్నాబాద్ లో మిన్నంటిన సంబరాలు..
హుస్నాబాద్ నియోజవర్గంలోని హుస్నాబాద్ పట్టణంలో, వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేసుకొని హుస్నాబాద్ బీడు భూములకు గోదావరి జలాలు రాబోతున్నాయన్న ఆనందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు, కౌన్సిలర్లు వల్లపు రాజు, చిత్తారి పద్మ, కోమటి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
