నేడు కరీంనగర్ లో జరిగే పట్టభద్రుల సింహ గర్జనను విజయవంతం చేయండి
కోర్ టీమ్ సభ్యుడు తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కరీంనగర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే సర్కస్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామా బాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ పట్టభద్రుల సింహ గర్జనను విజయ వంతం చేయాలని కోర్ టీమ్ సభ్యులు తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్ కోరారు. శనివారం మండల కేంద్రంలో నిర్మింహించిన సన్నాహక సమావేశంలో పట్టభద్రుల మహా గర్జన కరపత్రాలను వెంకటేష్ అవిష్కరించారు. మహా గర్జన సభకు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హజరవుతున్నారని పట్టభద్రులు పెద్ద ఎత్తున హజరై విజయంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన 19 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల సమస్యల సాధనకై వస్తున్న ప్రసన్న హరికృష్ణకు మద్దతు గా సింహ గర్జన సభకు భారీ ఎత్తున పట్టభద్రులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల భాద్యులు తాళ్లపల్లి వెంకటేష్, బీసీ సంఘాల నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, కొయ్యడ కొమరయ్య, వేల్పుల రాజు, అది మియా తదితరులు పాల్గొన్నారు.
