విద్యార్థుల ను సామాజిక బాధ్యత పై చైతన్యం తేవాలి..
తెలంగాణ ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆవిర్భావం..
సిద్దిపేట జిల్లా టిపిఎస్ఏ నూతన కార్యవర్గం ఎన్నిక.. అధ్యక్షుడిగా భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్ రెడ్డి..
అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ఆగస్టు 24

తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (టిపిఎస్ఏ) ఆవిర్భావం జరిగింది.. సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్ రెడ్డిలు ఎన్నికయ్యారు. అలాగే కోశాదికరిగా జీ.సంపత్, ఉపాధ్యక్షులుగా సంతోష్ కుమార్, లింగం, కోశాధికారిగా జి సంపత్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఏం.రమేష్, ముఖ్య సలహదారులుగా జి వెంకటేష్, కిరణ్, ఉదయాకర్,మాళవిక, లావణ్య రెడ్డి, లీగల్ అడ్వైజర్ గా సిహెచ్ సంతోష్ కుమార్ లను ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ని కలిసారు ఈ సందర్బంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ను సామాజిక బాధ్యత వైపు చైతన్యం తేవాలని సూచించారు.. పిల్లలు డ్రగ్స్ ఆన్ లైన్ గేమ్స్ వైపు వెళ్లకుండా అవగాహన కలిపించాలని చెప్పారు..
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ త్వరలోనే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ టిపిఎస్ఎ అసోసియేషన్ కి అధ్యక్షులుగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఉంటారన్నారు. ఎన్నిక ముందు గౌరవ ఎమ్మెల్యే హరీష్ రావుని కలిసి సలహా సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికలు టిపిఎస్ఎ సభ్యులు పాల్గొనడం జరిగింది. తమపై నమ్మకం పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.







