మద్యం, మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు
హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.మల్లికార్జున్ గౌడ్
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్ :
దసరా పండగ వచ్చిందంటే సుక్క, ముక్క లేనిదే గడవదు. కాగా గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడంతో ప్రజల్లో కాస్త నిరాశ ఎదురయింది. దసరా పండుగకు కోళ్లు, మేకలు బలివ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. గాంధీ జయంతి అహింసను ప్రతిబింబిస్తుంది. అందువల్లే అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని పట్టణంలో ఉన్న మద్యం, మాంసం దుకాణదారులు మద్యం గాని మాంసం గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయని మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ హెచ్చరించారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా మద్యం,మాంసం అమ్మకాలపై నిషేధం ఉన్నందున దుకాణదారులందరికీ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా చర్యలు అతిక్రమించి అమ్మకాలు చేపడితే 2019 యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
Posted inహుస్నాబాద్
మద్యం, మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు





