చిల్లర రాజకీయాలు మానుకో పాడి కౌశిక్ రెడ్డి
హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు మాట్లాడుతూ..అవినీతి మచ్చ లేనటువంటి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రిపై నిందలు వేస్తున్నావు. పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని జీర్ణించుకోలేని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దమ్ముంటే నిజానిజాలతో పాటుగా ఆధారాలతో చూపించాలి తప్ప మనిషి మీద నిందలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు డిమాండ్ చేశారు.. పాడి కౌశిక్ రెడ్డి గత ఎన్నికలలో ఓడిపోతామని భార్యను తన పిల్లలను బహిరంగంగా గెలిపించకపోతే చనిపోతామని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అవినీతి లేనటువంటి మంత్రిపై అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్టుగా కాదని.. దమ్ముంటే ఆధారాలతో చూపెట్టాలని.. సో ఈ తప్పి ప్రవర్తించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొల్సి వస్తుందని హెచ్చరించారు..
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి బిసి నాయకుడు పొన్నం ప్రభాకర్ కి రాష్ట్రంలో వస్తున్నా ఆదరణ చూసి ఓర్వలేక చౌక బారు ఆరోపణలు చేస్తు కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావు దగ్గర పేరు తెచ్చుకోవడానికి పాడి కౌశిక్ రెడ్డి ఎది పడితే అది మాట్లాడితే చూస్తుా ఊరుకునే ప్రసెక్తే లేదని నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము అని అన్నారు.
Posted inహుస్నాబాద్
చిల్లర రాజకీయాలు మానుకో పాడి కౌశిక్ రెడ్డి
