దొంగిలించిన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు ప్రత్యక్షం..
మోడల్ స్కూల్ మెయిన్ గేట్ పక్కన ప్రత్యక్షమైన లాప్ టాప్ లు,కంప్యూటర్ లు
సిద్దిపేట టైమ్స్, మద్దూరు (అక్టోబర్, 09):
గత నెల (సెప్టెంబర్ ) 27న మద్దూరు మోడల్ స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ లోని 9 ల్యాప్ టాప్ లు, 3 కంప్యూటర్ లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.అయితే మోడల్ స్కూల్ మెయిన్ గేట్ పక్కన దొంగిలించిన ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ లు గురువారం ప్రత్యక్షమయ్యాయి. గేట్ పక్కన పడేసి ఉన్న కంప్యూటర్, లాప్ టాప్ లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేర్యాల సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ షేక్ మహబూబ్ చేరుకొని డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. పంచనామా నిర్వహించి లాప్ టాప్ లు,కంప్యూటర్ లను స్వాధీనం చేసుకున్నారు.దొంగిలించిన వ్యక్తులే ఇలా వాటిని పడేసి వెళ్లారా లేదా ఇంకా ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంప్యూటర్, లాప్ టాప్ లను దొంగిలించిన లేదా ఇలా పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది వారికీ పెద్ద సవాల్ ల మారింది.






