హుస్నాబాద్ లో స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో 68 వ రాష్ట్రస్థాయి 14 సంవత్సరాల బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలను ఈ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించగా క్రీడాజ్యోతిని ఆకుల రజిత వెంకన్న, విశిష్ట అతిథి కేడం లింగమూర్తి, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, జాతీయ క్రీడాకారుడు జశ్వంత్తో కలిసి జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొంది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కేవలం మార్కులే ప్రామాణికంగా కాకుండా శారీరక దృఢత్వం కోసం మానసిక వికాసం కోసం క్రీడలను ఆడాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కెడం లింగమూర్తి మాట్లాడుతూ… హుస్నాబాద్ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నట్లు రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడలను ఇక్కడ నిర్వహిస్తామని స్టేడియం కు అవసరమైనటువంటి అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ క్రీడల్లో 10 జిల్లాల నుండి బాలురు మరియు బాలికలు 320 మంది కోచ్ మేనేజర్ 40 మంది, ఆఫీషల్స్ 20 మంది, 40 మంది పీడి/పీ ఈ టీ లు పాల్గొంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని ఈనెల 25వ తేదీ నుండి 29 వరకు చత్తీస్గఢ్లోని మహాసముందులో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని స్టేట్ అబ్జర్వర్స్ శ్రీను మరియు షేక్ ఉస్మాన్ తెలిపారు. క్రీడల నిర్వహణలో విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించినట్లు కన్వీనర్ శ్రీనివాస్ మరియు సెక్రటరీ సౌందర్య తెలియజేశారు . ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ నళిని, ఎంఇఓ మనీలా, స్టేట్ అబ్జర్వేర్స్ జి శ్రీను, ఉస్మాన్ షేకు, అశోక్ పెద్ద, తోట సతీష్, జంగాపల్లి వెంకట నరసయ్య, సౌందర్య, కన్వీనర్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.