గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తికి నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు.
సిపిఐ పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ వరద కాలువ.
పెండింగ్ లో ఉన్న నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
వరద కాలువ కొసం 40 ఏండ్లుగా భారత కమ్యునిస్టుపార్టీ (సిపిఐ) జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో సాగించిన ప్రజా పోరాటాలతోనే 2007లో అనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సిపిఐ తరపున ఇందూర్తి ఎమ్మెల్యే గా చాడ వెంకటరెడ్డి ఉన్న సమయంలో శ్రీరాం సాగర్ వరద కాలువ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో గౌరవెల్లి, గండిపెల్లి, తోటపెల్లి రిజర్వాయర్ కొసం నిధులు మంజూరు చేయించి శంఖుస్థాపన చేయించామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ సిద్దిపేట వెంకటరెడ్డి అన్నారు
శుక్రవారం నాడు చాడ వెంకటరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గత బిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వంలో గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యం పెంచినందు వల్ల 80 శాతం భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించకుండా రిజర్వాయర్ పూర్తికి తగిన నిధులు మంజూరి చేయకపోవడం బిఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లే గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదని నిర్వాసితులకు తగిన న్యాయం జరగలేదని ఆయన అన్నారు. 2007లో శంకుస్థాపన చేయబడిన గండిపెల్లి ప్రాజెక్టు మెదటికే మొక్షం లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ నిర్మాణం పనుల కోసం గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రాజెక్టు పూర్తి, కెనాల్ నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయుటకు, నిర్వాసితులకు న్యాయమైన డిమాండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం చేయాలని, కలిసి కొరిన వెంటనే స్పందించి నిధులు మంజూరి చేసినందుకు చాడ వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా భూనిర్వాసితుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లకు రావాల్సి పునరావాస ప్యాకేజీని గత ప్రభుత్వం ఇవ్వకుండా అనేక ఆంక్షలు పెట్టి అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రజా పాలనలో న్యాయం చేయాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇందూర్తి, భీమాదేవరపల్లి, ఎల్కతుర్తి, హుస్నాబాద్, సైదాపుర్, కొహెడ వరకు భూసేకరణ చేసి కెనాల్ నిర్మాణం పనులును వేగవంతంగా పూర్తి చేయాలని పెండింగ్ లో నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఎం రేవంత్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కృషి చేయాలని చాడ వెంకటరెడ్డి కోరారు.