ఈనెల 25 న హుస్నాబాద్ మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్ష
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మండల స్థాయి 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తేది 25/06/2024 అనగా మంగళవారం రోజున స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు బాలుర ఉన్నత పాఠశాల హుస్నాబాద్ లో ఉదయం 10:00 గంటలకు నిర్వహిస్తున్నామని M.E.O యాదవ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని కోరారు.