క్రీడలు మానసిక దృఢత్వానికి దోహదపడతాయి
హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో స్విమ్మింగ్ పూల్ తో పాటు క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము.
హుస్నాబాద్ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి



యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని హుస్నాబాద్ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలో నిర్వహించిన కృష్ణ కబడ్డీ సమ్మర్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న సాయి కృష్ణ పంపించిన క్రీడా దుస్తులను సమ్మర్ క్యాంప్ లో పాల్గొన క్రీడాకారులకు అందజేశారు. సమ్మర్ కోచింగ్ క్యాంపును పూర్తిగా సద్వినియోగం చేసుకున్నామని, హుస్నాబాద్ లో ఇలాంటి కోచింగ్ క్యాంపులు తరచుగా నిర్వహించడంతోపాటు క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని క్రీడాకారులు కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో సమ్మర్ కబడ్డీ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు కృష్ణ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని యువకులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారని క్రీడా కమిటీ సభ్యుడు బంక చందు తెలిపారు. కబడ్డీ క్రీడ నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవితం ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా ప్రభాస్ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో హుస్నాబాద్ లో స్విమ్మింగ్ పూల్ తో పాటు క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. క్రీడల కోచింగ్ తో పాటు ఇంగ్లీష్ తరగతులను కూడా చెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కేడం లింగమూర్తి, కమిటీ సభ్యులు బంకచందు, వెన్నరాజు, నియోజకవర్గ కోచ్ కమిటీ సభ్యుడు మడక కృష్ణ, మాజీ ఎంపిటిసి బొమ్మగాని హరిబాబు, శ్రీనివాస్, పోలు సంపత్, క్రీడాకారులు పాల్గొన్నారు.