దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలి… పెండింగ్ కేసులు డిస్పోజ్ చేయాలి
డయల్ 100 కు స్పందించాలి… ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
హుస్నాబాద్ డివిజన్ పెండింగ్ కేసుల సమీక్ష సమావేశంలో కమిషనర్ అనురాధ
సిద్దిపేట టైమ్స్ డెస్క్:

హుస్నాబాద్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులపై పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మంగళవారం రోజు కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024, 2025 సంవత్సరాల్లో అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులపై ఏసీపీ, సీఐ, ఎస్ఐల నుండి వివరాలు తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ, “కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలి, నిందితులను అరెస్టు చేసే విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదు, లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలి, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వహించాలి. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 2024 సంవత్సరంలో పెండింగ్ ఉన్న కేసులలో అన్ని కోణాలుల్లో పరిశోధన చేసి కేసులు ఫైనల్ చేయాలని సూచించారు. దొంగతనాల నివారణ గురించి ప్రత్యేక చర్యలు చేపట్టాలి రాత్రి సమయాలలో బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ అధికారులు సిబ్బంది నిరంతరంగా విధులు నిర్వహించాలి. డయల్ 100 కాల్ రావాలి వెంటనే రెస్పాండ్ అయి స్వార్థమైనంత త్వరగా సంఘటన స్థలానికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. డయల్ 100 కాల్స్ పై అలసత్వం వహించవద్దు. నాన్ బేలబుల్ వారెంట్ (NBWs) సాధ్యమైనంత త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల గురించి రోడ్ సేఫ్టీ కమిటీ, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను సందర్శించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు పెండింగ్ ఉన్న దరఖాస్తులను విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీస్ సింగ్ విధులు నిర్వహించాలి, యంఓ అపెండర్స్, సస్పెక్ట్లు, కేడీలు, డిసీలు, రౌడీలు, పై నిఘా ఉంచి వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ లో ఎఫ్ఐఆర్, సిడిఎఫ్, పార్ట్ వన్, పార్ట్ టూ, రిమాండ్ డైరీ, చార్జిషీట్ సీసీ నెంబర్ డాటా ను ఏరోజు కారోజు ఎంట్రీ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, చేర్యాల సీఐ శ్రీను, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్ తో పాటు హుస్నాబాద్ డివిజన్ ఎస్ఐలు లక్ష్మారెడ్డి, అభిలాష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.




