నైరుతి రుతుపవనాల రాక గురించి భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయని తాజాగా వెల్లడించింది. గురువారం దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఉదయం కేరళ ను తాకాయని భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి కబురు అందించినట్లయింది. ఇక ఈసారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వానలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.
Posted inతాజావార్తలు నేషనల్
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
