
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మండలంలోని వంగరామయ్య పల్లిలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ అధ్యక్షులు బంక చందు ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలసి బంక చందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బంక చందు మాట్లాడుతూ… 60 సం.రాల తెలంగాణ ఆకాంక్ష ను గుర్తించి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మునుగుతుంది అని తెలిసిన పదవులు ముఖ్యం కాదని ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అని, తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయ వల్లనే సాధ్యం అయిందని అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అన్నారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలు, మన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంటు లో పెప్పర్ స్ప్రే దాడిని చూసి చలించిన శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తర్వాత 10సం.రాలు కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ సౌకర్యం, 10లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అర్హులైన రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్, సిఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మీ పథకం అమలు, మండల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, సరోజన, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవీందర్, విన్న రాజు, హసన్, పెరుమాండ్ల నర్సాగౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.