అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు
సిద్ధిపేట టైమ్స్,మద్దూరు:
అత్తను అల్లుడు దారుణంగా నరికి చంపిన సంఘటన మద్దూరు మండలం మర్మాముల గ్రామ పంచాయతి అమ్లెట్ బంజరలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జంగిలి వజ్రమ్మ (55) తన కూతురు భవానిని మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్ కి ఇచ్చి వివాహం చేసింది.మహేష్,భవానిల మధ్య మధ్య ఇటీవల గొడవలు తలెత్తడంతో గత మూడు రోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో రాజీ పడి అదివారం భవానిని తన భర్తతో అత్తగారి ఇంటికి పంపించారు.సోమవారం జక్కల మహేష్ తన సోదరుడు జక్కుల హరీష్ ఇద్దరు కలిసి బంజర గ్రామానికి వచ్చారు.ఈ మేరకు అత్త, అల్లుడి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దగా కావడంతో ఇద్దరు కలిసి పదునైనా ఆయుధంతో వజ్రమ్మను దారుణంగా హత్య చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు.
అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు
