మాడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి.
బదిలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, 010 ద్వారా వేతనాల సమస్యలు పరిష్కరించండి
బడి ముందు నిరసన తెలిపిన నాగసముద్రాల ఆదర్శ పాఠశాల ఉద్యోగులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న పి.జి.టి, టి.జి.టి ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందని హెల్త్ కార్డులు లేక సమయానికి వేతనాలు రాక అనేక ఇబ్బందులకు గురయ్యామని ఉపాధ్యాయులు ఆవేధన వ్యక్తం చేశారు.
ఇటివల నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నైన దీర్ఘకాలిక సమస్యలైన బదిలీలు, కారుణ్య నియామకాలు, హైల్త్ కార్డులు, 010 ద్వారా ప్రతి నేల వేతనాలు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కృషి చేయాలని మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం నాగ సముద్రాల ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకోని నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగ సముద్రాల ఆదర్శ పాఠశాల ఉద్యోగులు కె.శారద, యం.కె.కె.పాపని, ఆర్.భవ్య, బి.జ్యోతి, జి.రాంనారాయణ, డి.రమేష్, యం.శైలేజ,
జి.రాజు, వి.శ్రీనివాస్, జి.ఎల్. ప్రసన్న, బి.రమేష్ పాల్గొన్నారు.
