రేపటి యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు..
సిద్దిపేట టైమ్స్, నంగునూరు, ఆగస్టు 19:
యూరియా కోసం రైతులు 24 గంటల ముందు నుంచే క్యూ లో తమ చెప్పులను పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్ కార్యాలయం వద్దకు బుధవారం వచ్చే యూరియా కోసం మంగళవారం నుంచే రైతుల తమ చెప్పులను క్యూలో పెట్టిన దృశ్యం యూరియా కొరతకు అద్దం పడుతోంది. అంటే యూరియా కోసం రైతుల తిప్పలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. రైతులు తమ రోజువారీ పనులను వదులుకుని యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు మంగళవారం వచ్చారు. చాలాసేపు వేచి ఉన్నారు. యూరియా బుధవారం వస్తుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో బుధవారం వచ్చే యూరియా కోసం క్యూ లైన్లో తమ చెప్పులను పెట్టి తిరిగి వెళ్ళి పోయారు.






