ఉపాధి కూలీలకు దొరికిన వెండి నాణేలు
సిద్దిపేట టైమ్స్, వెబ్
మద్దూర్ మండలం నర్సయపల్లి గ్రామంలోని ఉపాధి కూలీ పనులు చేస్తుండగా కూలీలకు వెండి నాణేలు దొరికాయి. ఇందులో 25వెండి నాణేలు, 2 ఉంగరాలు ఉన్నాయి.
గురువారం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఓ పొలాన్ని చదును చేస్తుండగా.. వారికి రాయితో చేసిన బాక్స్ కనిపించింది. మొదట వారంతా దానిని తెరిచేందుకు భయపడ్డారు. ఎలాగోలా తెరచి చూడగా.. అందులో 25 వెండి నాణేలు ఉన్నాయి. అదేవిధంగా వెండితో చేసిన రెండు ఉంగారాల కూడా లభ్యమయ్యాయి. ఈ విషయంలో అందరి నోట్లో పడటంతో ఊరుఊరంతా నాణేలను చూసేందుకు ఎగబడ్డారు. కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అధికారుల దృష్టికి వేల్లడంతో వారు పరిశీలిస్తున్నారు.



