పేకాట స్థావరాల పై పోలీసుల దాడి.. ఏడుగురి అరెస్టు

పేకాట స్థావరాల పై పోలీసుల దాడి.. ఏడుగురి అరెస్టు

పేకాట స్థావరం పై  సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు కోహెడ పోలీసుల దాడి… ఏడుగురి అరెస్ట్

సిద్దిపేట టైమ్స్ డెస్క్:

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి  పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై  సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు వెళ్లి రైడ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 9390/- రూపాయలు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్  స్వాధీనం చేసుకున్నారు కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

తంగళ్ళపల్లి గ్రామంలో ఒక ఇంటిలో  ఏడుగురు వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై  సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు వెళ్లి దాడి చేసి వారి వద్ద నుండి 1550/- నగదు డబ్బులు 7 మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్ళు  స్వాధీనం చేసుకుని కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

ఈ సందర్భంగా  టాస్క్ ఫోర్స్  అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో  జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *