అవినీతికి కేరాఫ్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్..
సిద్ధిపేట మున్సిపాలిటీలో…
కరోనా కంటే వేగంగా అవినీతి పెరిగిపోతుంది..
కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం,

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, జులై 31:
అవినీతికి కేరాఫ్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ అంటు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, బీఆర్ఎస్ నాయకుడు ఉదర మణిదీప్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మున్సిపల్ చట్టంలోని నిబంధనలు అడ్డు పెట్టుకొని చెక్ ల రూపేనా ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున దారి మళ్లించాడని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ ప్రజల అత్యవసరాల కోసం మాత్రమే చెక్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. 10 నెలల కాల వ్యవధిలో సుమారు కోఠిన్నర వరకు 148 చెక్ ల రూపేనా నిధులు దారి మళ్లించినట్లు ఆరోపించారు. ఇంటి పన్ను పున పరిశీలన పేరిట పాలక వర్గాన్ని తప్పు దొవ పట్టించి పట్టణ పరిధిలోని కమర్షియల్ బిల్డింగులు, పెద్ద భవనాల ఆస్తీ పన్నులను కుదించి బల్దియా ఆదాయానికి గండి కొట్టారన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ను మెప్మా నిధులతో అధునీకరించినట్లు తొలుత చెప్పిన మున్సిపల్ కమిషనర్ నేడు స్వంత నిధులతో అధునీకరించినట్లు వెల్లడించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి మెప్మా నిధులను మున్సిపల్ కార్యాలయ పనుల కోసం వినియోగించుకునే అవకాశం ఉండదన్నారు. మున్సిపల్ కమిషనర్ అవినీతి పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దుర్వినియోగం చేసిన డబ్బుల రికవరీ తో పాటుగా విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు.