రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న సిద్దిపేట జిల్లా ఫోటో జర్నలిస్టులు..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2025 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో 94 ఎంట్రీల్లో 744 ఫోటోలతో పోటీ పడి సిద్దిపేట జిల్లా ఫోటో జర్నలిస్టులు
అవార్డులను గెలుచుకున్నారు. చేయూత విభాగంలో వీ6 వెలుగు ఫోటోగ్రాఫర్ కి మొదటి బహుమతి, ఆంద్రజ్యోతి ఫోటోగ్రాఫర్ బాబురావు కి రెండు వ బహుమతి అలాగే రైతు భరోసా విభాగంలో సాక్షి ఫోటోగ్రాఫర్ కె.సతీష్ కి ఉత్తమ ఫోటో అవార్డులను అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో రాష్ట్ర సమాచార, గృహా నిర్మాణ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డులు రావడం పట్ల పలువురు జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సమాచారం శాఖ కమిషనర్ ప్రియాంకా, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








