సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి నియామకం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి మెంబర్, హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రంధాలయ చైర్మన్ గా ప్రభుత్వం ఆయనను నియమించిందని ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్ పదవిలో కేడం లింగమూర్తి ఐదు సంవత్సరాలు ఉంటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని లింగమూర్తి తెలియజేశారు. ఈసందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
