హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శ్రమదానం, స్వచ్ఛత ర్యాలీ
ఈ శ్రమదాన కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ అర్బన్ టీమ్ అభినందన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న “స్వచ్ఛత హి సేవ – 2025” కార్యక్రమం కింద హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విస్తృతంగా శ్రమదానం, ర్యాలీ మరియు స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. పురపాలక సంఘ కమిషనర్ టి. మల్లికార్జున్ నాయకత్వంలో అధికారులు, సిబ్బంది కలిసి BSNL ఆఫీస్‌కు వెళ్లే దారిలో డ్రైనేజీ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం BSNL ఆఫీస్ నుండి నెహ్రూ చౌరస్తా వరకు స్వచ్ఛతపై నినాదాలతో స్వచ్ఛత ర్యాలీ కొనసాగింది.
ర్యాలీ ముగిసిన తర్వాత కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ –పట్టణ ప్రజలందరూ వారంలో కనీసం రెండు గంటలు స్వచ్ఛత కోసం కేటాయించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే స్వచ్ఛ పట్టణంగా నిలపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మేనేజర్ సంపత్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ADMC సంతోష్ మాత, ఇన్‌చార్జ్ RI ప్రసాద్, C1 సెక్షన్ శంకర్, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, శానిటేషన్ సిబ్బంది, వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జరిగిన శ్రమదానం, స్వచ్ఛత ర్యాలీ మరియు స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ అర్బన్ టీమ్ అభినందించి రీపోస్ట్ చేయడం హుస్నాబాద్ పురపాలక సంఘానికి గౌరవంగా నిలిచింది.
ప్రజలు స్వచ్ఛతలో భాగస్వామ్యం అవుతూ హుస్నాబాద్ పట్టణాన్ని ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పట్టణంగా మార్చాలని అధికారులు ఆకాంక్షించారు.





