అక్బరుపేట సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన అగ్నిప్రమాదం
పీటీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు
అప్రమత్తమై ఫైర్ సేఫ్టీతో మంటలు అర్పిన లైన్ మెన్ శంకర్
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి
అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్ పైభాగంలో ఉన్న పొటెన్షియల్ ట్రాన్స్ ఫార్మర్ (పీటీ)లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు వ్యాపించాయి. లైన్మెన్ శంకర్, సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి మంటలను చాకచక్యంగా ఆర్పేశారు. ప్రస్తుతం పీటీకి మరమ్మతులు చేపడుతున్నారు.
Posted inహుస్నాబాద్
అక్బరుపేట సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన అగ్నిప్రమాదం





