ఉద్యోగ జీవితంలో చేసిన సేవలే గుర్తింపు నిస్తాయి..
ఈ ఓ మోహన్ రెడ్డి చేసిన సేవలు అభినదనీయం..
ఏడుపాయల దేవాలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్..
హాజరైన మాజీ చైర్మన్లు,దేవాలయ కమిటీ సభ్యులు..
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
ఉద్యోగ జీవితంలో పదవి విరమణలు సహజమని పని చేసిన సమయంలో తెచ్చుకున్న పేరు కలకాలం ఉంటుందని ఏడుపాయల దేవాలయ కమిటీ చైర్మన్ బాలగౌడ్ అన్నారు. శుక్రవారం ఏడుపాయల ఆలయ ఈవో మోహన్ రెడ్డి పదవి విరమణ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ..ప్రతి ఉద్యోగికి తన ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజమన్నారు.19ఆలయాలకు ఇంచార్జీ ఇఓ గా బాధ్యతల భారాన్ని అధిగమిస్తూ ఉద్యోగదర్మాన్ని నిర్వర్తించిన మంచి మనిషి గా ఈవో మోహన్ రెడ్డి అందరి మన్ననలు పొందారని అన్నారు.ముఖ్యంగా ఆలయ ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా చూసిన తీరును ఆయన అభినందించారు. ఈవో మోహనరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ.19.ఆలయాల ఈవోగా పని చేయడం దేవుడిచ్చిన వరం అన్నారు. 6ఏళ్ల పాటు ఈవో గా విధులు నిర్వహించడం సంతోషంగాఉందన్నారు. అందరి సహకారంతో ఏడుపాయల ఈవోగా, ఆ సమయంలో పలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నర్సింలు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ నాయక్ , పాపన్న పేట పాలక మండలి సభ్యులు బాగారెడ్డి,శ్రీనివాస్ గౌడ్ సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,పార్థివ పంతులు, శంకర శర్మ,, తో పాటు వివిధ దేవాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మోహన్ రెడ్డి దంపతులను సన్మానించిన ఆలయ సిబ్బంది, నాయకులు…
పదవి విరమణ పొందిన ఏడుపాయల దేవాలయ ఈ ఓ మోహన్ రెడ్డి దంపతులను చైర్మన్ బాలాగౌడ తో పాటు అర్చకులు, వేదపండితులు,నాయకులు, ఆలయ ధర్మ కర్తలు సన్మానించారు ..