తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు
నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు
నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
తెలంగాణ హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సంచలన తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా అనర్హత పై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేస్తామన్న తెలంగాణ హైకోర్టు. బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ల పై అనర్హత వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని ఇటీవల బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందగౌడ్ లు హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.





