హుస్నాబాద్ లో రైతు వేదిక వద్ద రుణమాఫీ సంబరాలు
రైతు రుణమాఫీ లో రాష్ట్రస్థాయిలో హుస్నాబాద్ కు ద్వితీయ స్థానం
రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ రైతు వేదిక శిబిరంలో గురువారం రోజున రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు మాట్లాడుతున్న కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు అధికారులు కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతు వేదిక వద్ద కేక్ కట్ చేసి, పటాకులు కాలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రుల చిత్రపటాలకు రైతులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన లక్ష రూపాయల రుణమాఫీ లో హుస్నాబాద్ కి ద్వితీయ స్థానం
ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ ని అమలు చేసింది. ఈరోజు లక్ష రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేసిన దానిలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచింది. లక్ష రూపాయలు రుణమాఫీ అమలు అయినా వాటిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 18907 ఖాతాలల్లో 18101 కుటుంబాలకు 106 కోట్ల 74 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. రుణమాఫీ తో సంబరాలు జరుపుకుంటున్న రైతులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి పి సి సి మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జేఏసీ నాయకులు లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ వీరన్న నాయక్, మేకల వీరన్న యాదవ్, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, భూక్యా సరోజన, వల్లపు రాజు కాంగ్రెస్ నాయకులు కర్ణకంటి మంజులారెడ్డి, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు, బూరుగు కృష్ణస్వామి, వెన్నరాజు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
