అక్రమకేసులు పెడుతున్న సిద్దిపేట పోలీసులపై చర్యలు తీసుకొండి..
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు..
సిద్దిపేట పోలీసులు సురేందర్ రెడ్డి లేని లోటు తీర్చుతున్నారు..
ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట బ్యూరో:
సిద్దిపేట పట్టణ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ ఆరోపించారు. చట్టాన్నీ చేతుల్లోకి తీసుకొని అక్రమ కేసులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సోమవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలీసుల తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానాని చెప్పారు. . చిన్నకోడూరు మండలం గంగాపూర్ కు చెందిన, కాంగ్రెస్ కార్యకర్తపై తల్లిని చంపిన కేసు నమోదు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ పోలీసులు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో సిద్దిపేటలో పని చేసిన సురేందర్ రెడ్డి ఇక్కడ లేని లోటును కొంత మంది పోలీసులు తీర్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకు వెల్లి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. కార్యకర్తల కు అండగా నేనుంటానని ఎవరూ అధైర్యపడోద్దన్నారు. చక్రధర్ గౌడ్ వేంట చంద్రశేఖర్ నిలబడుతున్నందుకే కక్ష్యపురితంగా అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ సంఘటన పై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఈ కేసును రిఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నకోడుర్, సిద్దిపేట వన్ టౌన్, ఏసీపీ కార్యాలయాల్లోని సీసీ పుటేజులు తెప్పించి పరిశోధన జరపాలని సీపీని కోరినట్లు వివరించారు.