ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి

ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి

ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి

అద్దె భవనాల్లో ఎస్సీ, బీసీ విద్యార్థుల చదువులు..!!!

సరైనా సౌకర్యాలు లేకా విద్యార్థుల ఇక్కట్లు…నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఆనారోగ్య సమస్యలు….!!

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్…!!

ఎస్సీ బాలుర హాస్టల్ ను సందర్శించిన అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు…!!

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బుధవారం ఎస్సీ, బీసీ బాలుర హాస్టల్ ను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయగా, నాణ్యతలేని కూరలు, పెరుగు, అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ఎస్సీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహించగా, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పంథాలో వ్యవహారిస్తూ ఎస్సీ విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తుంది. హుస్నాబాద్ పట్టణం చుట్టూ వంద గ్రామాలకు చదువు కోసం కాని, ఇతరత్రా అవసరాలకు అనువైనా స్థలం, గతంలో ఎస్సీ, బీసీ హాస్టల్ లో వంద శాతం విద్యార్థుల సంఖ్య ఉండేది, కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్యా గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోయిందన్నారు. ఆరు గ్యారంటీలో ఇచ్చిన ప్రతి మండలంలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాను ప్రశ్నించారు. అద్దె భవనాల్లో ఎస్సీ హాస్టల్ నిర్వహించడం చూస్తే ఎస్సీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే ఎస్సీ హాస్టల్ కు స్వంత భవనం మంజూరు చేయాలని, ఎస్సీ హాస్టల్ స్థితి గతుల పట్ల చర్యలు తీసుకోవాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు కొంకటి కిశోర్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు బొల్లి శ్రీనివాస్, వరియోగుల అనంతస్వామి, అశాడపు శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బొల్లి సుధాకర్, మొలుగూరి గణేష్, నాయకులు అంతెర్పుల వెంకటేష్, మాచర్ల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *