హుస్నాబాద్ ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం
కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కార్తీక మాసంను పురస్కరించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ మంజుల దంపతుల ఆధ్వర్యంలో జరిగే సత్యనారాయణ వ్రతంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కార్తీక మాసం పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో సతన్యారాయణ వ్రతం చేస్తున్నామని హుస్నాబాద్ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనే కోరికతో స్వామి వారి వ్రతం జరుగుతుందని తెలిపారు. ఈ సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటుగా బోజనాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.