హుస్నాబాద్ మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు తుది నిర్ణయమయ్యాయి. మండలంలో మొత్తం 17 సర్పంచ్ స్థానాలు, 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేటాయింపులు అధికారికంగా ప్రకటించారు.
ఎంపీటీసీ స్థానాలు (6):
SC, ST, OCలకు ఒక్కోటి, BCలకు 3 స్థానాలు రిజర్వయ్యాయి.
పందిళ్ళ – ST జనరల్
పొట్లపల్లి – SC జనరల్
పోతారం (ఎస్) – BC జనరల్
గాంధీనగర్ – BC మహిళ
మీర్జాపూర్ – BC జనరల్
మహమ్మదాపూర్ – OC జనరల్
సర్పంచ్ స్థానాలు (17):
మొత్తం ST 2, SC 3, BC 7, జనరల్ 5గా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.
ST (2): జిల్లెల్లగడ్డ – జనరల్, వంగరామయ్యపల్లి – మహిళ
SC (3): మీర్జాపూర్ – జనరల్, పొట్లపల్లి – జనరల్, పోతారం (ఎస్) – మహిళ
BC (7): బంజరుపల్లి – మహిళ, మాలపల్లి – మహిళ, పందిళ్ళ – మహిళ, గాంధీనగర్ – జనరల్, కుచనపల్లి – జనరల్, రాములపల్లి – జనరల్, ఉమ్మాపూర్ – జనరల్
జనరల్ (5): తోటపల్లి, మడద, నాగారం, బళ్ళు నాయక్ తండ, మహమ్మదాపూర్
ఈ రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు బరిలోకి దిగేందుకు సన్నాహాలు ప్రారంభించారు. హుస్నాబాద్ మండలంలో రాబోయే ఎన్నికల వాతావరణం ఇప్పటికే ఉత్కంఠ రేపుతోంది.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్ మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు





