హుస్నాబాద్ లో ఘనంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శాంప్రసాద్ ముఖర్జీ 71వ బలిదాన్ దివస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శాంప్రసాద్ ముఖర్జీ 71వ బలిదాన్ దివస్ ను బిజెపి అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాశ్మీర్ భారత్లో శాశ్వత అంతర్భాగంగా నిలిచిపోవడానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిరస్మరణీయుడని హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అన్నారు.
భారతీయ జనసంగ్ వ్యవస్థాపకులు నేటి బిజెపి మూల సృష్టికర్త 370 ఆర్టికల్ రద్దు కోసం 1953లో శ్రీనగర్లో ఆత్మ బలిదానం అయిన ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త కొనసాగించాలని బలిదాన్ దివస్ హుస్నాబాద్ పట్టణ కన్వీనర్ చిట్టి గోపాల్ రెడ్డి అన్నారు.
సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ ముఖర్జీ జీవితంలోని విముక్తి కోసం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించారు వారి ఆశయాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ ను రద్దు చేశారని గుర్తు చేశారు.
మహిళా మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తోటస్వరపు మాట్లాడుతూ ముఖర్జీ ఆశయాల్లో భాగమైన 370 ఆర్టికల్ రద్దు కావటం సంతోషదాయకం అని అన్నారు.
శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నుండి జయంతి జూలై 6 వ తేదీ వరకు ప్రతి వార్డులో నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్ర జిల్లా పార్టీల ఆదేశాల మేరకు కన్వీనర్ గా చిట్టి గోపాల్ రెడ్డిని కో కన్వీనర్లుగా రాయికుంట చందు, చెన్నబోయిన రవీందర్ లను పట్టణాధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ నియమించారు.

ఈ కార్యక్రమంలో తోట స్వరూప, పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్, రాయికుంట చందు, పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, గాదాసు రాంప్రసాద్, పట్టణ కార్యదర్శులు వేల్పుల నాగార్జున్, వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారి ఆకోజు అరుణ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, పట్టణ అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయి కృష్ణ, సీనియర్ నాయకులు పోల్సాని బాబురావు, వేముల దేవేందర్ రెడ్డి, ఒగ్గూజు వెంకటేశ్వర్లు, వరియోగులు అనంతస్వామి, లకావత్ శారద, బిజెపి నాయకులు బొడిగ వెంకటేష్, చెన్న బోయిన రవీందర్, బుర్ర రాజు, ఆషాడపు శ్రీనివాస్, యాదగిరి, ఇరుమల్ల రాకేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
