హుస్నాబాద్ నుండి సైదాపుర్ వీణవంక మీదుగా జమ్మికుంట వరకు బస్ సర్వీసులు నడిపించండి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరిన సిపిఐ.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ఆర్టిసి బస్ డిపో నుండి సైదాపుర్ కేశవపట్నం మెలంగూర్ స్టేజి మీదుగా వీణవంక జమ్మికుంట వరకు బస్ సర్వీసులు నడిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ శనివారం జరిగిన హుస్నాబాద్ మున్సిపాలిటీ సమావేశం కు రాష్ట్ర రోడ్డు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిన సందర్భంగా వినతి పత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి హుస్నాబాద్ నుండి జమ్మికుంట వరకు బస్ సర్వీసులు నడిపించాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు గడిపె మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్ నుండి జమ్మికుంట వరకు బస్ సర్వీసులు నడిపించండి
