సామాన్యులకేనా రూల్స్..?
జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటీజన్లు..
పోలీసులకు సామాన్యులే కనిపిస్తారా, అధికారులు కనిపించరా..?
సిద్దిపేట టైమ్స్, గజ్వెల్, జగదేవపూర్

సామాన్యుల వాహనాలపై కాస్తో, కూస్తో చాలానాళాలు ఉంటే వాహనాలను ఆపేయడం ఆనవాయితీ అయింది పోలీసులకు. వాహనాలపై 100 రూపాయలు చాలానాలు ఉంటే బండి ఆపి జరిమానాలు ఉంటే చెల్లిస్తావా.. లేక బండి సీజ్ చేయమంటావా అంటూ హెచ్చరిస్తూ సామాన్యుల నుండి ముక్కుపిండి మరీ జరిమానాలు వసూళ్లు చేస్తున్నారు. కానీ కొంతమంది బడా రాజకీయ నేతలు, అధికారులపై మాత్రం ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నారు వారికి మాత్రం ఇష్టం వచ్చినపుడు జరిమానాలు కట్టుకుంటున్నారు వారిపై మాత్రం ప్రేమాభావం చూపుతున్నారు. ఇక విషయానికి వస్తే జగదేవపూర్ తాశిల్దార్ వాహనం పై ఉన్న చాలాన్ల అంశానికి వస్తే వారి పని నిమిత్తం జగదేవపూర్ తాశిల్దార్ కార్యాలయానికి వచ్చి కొంతమంది సామాన్యులు ఆయన వాహనం పై ఓ.. లుక్కేసి తెరపైకి తెచ్చారు 100 రూపాయలు ఉంటే బండి ఆపిమరీ వసూళ్లు చేసే పోలీసులకు Ts 05 fj 7205 వాహనం పై నల్గొండ లో ఓవర్ స్పీడ్ కి 1000,మెదక్ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్దిపేట లో ఓవర్ స్పీడ్ 1000,రాంగ్ పార్కింగ్, జగదేవపూర్ లో 100,మొత్తం 2205 రూపాయలు జరిమానా ఉంటే వారి వాహనం కనిపించడం లేదా వారు మాత్రం వర్తించవా అంటూ పోలీసులపై మండిపడుతున్నారు. ప్రతినిధ్యం వాహనాలను నిలిపి ముక్కుపిండి వసూళ్లు చేస్తున్న పోలీసులకు ఆయన వాహనం కనిపించడం లేదా అంటున్నారు వారి కార్యాలయానికి వాస్తు పోతున్న వారు ఇప్పటికైన వాహనం పై దృష్టి పెట్టి ఉన్నత అధికారులు చాలానాలు వసూలు చేస్తారా లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.