ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నెలకొల్పుటకు రూ.11 లక్షలు మంజూరు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పురపాలక సంఘంలో మెప్మా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్ నెలకొల్పుటకు శనివారం శ్రీ భవాని గ్రూప్ లోని సభ్యురాలు పచ్చిమట్ల స్వప్న భర్త శివ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ. 11 లక్షల రూపాయల సాంక్షన్ లెటర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న అందించారు. చైర్ పర్సన్ ఆకుల రజిత మాట్లాడుతూ క్యాంటీన్ యూనిట్ నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, కౌన్సిలర్ భోజు రమాదేవి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మరియు మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ ముత్యాలరాజు పాల్గొన్నారు.





