హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో నేరాల నియంత్రణపై సమీక్ష
పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఏసీపీ సదానందం సూచనలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆదేశించారు. “ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతగా, ప్రతి ఫిర్యాదును సమయానికి పరిష్కరించాలి. చట్టం అమలులో ఎవరిపైనా రాజీ పడకూడదు,” అని ఏసీపీ సదానందం సిబ్బందికి సూచించారు. సమావేశంలో సిబ్బంది కేసుల పురోగతి, నేరాల నిరోధం, ప్రజలతో సాన్నిహిత్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి, కోహెడ ఎస్సై అభిలాష్, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





