ఏసీబీ వలలో రెవిన్యూ ఇన్స్పెక్టర్..
రైతు నుండి 70 వేల లంచం తీసుకుంటుడగ పట్టుకున్న ఏసీబీ అధికారులు..
ది సిద్దిపేట టైమ్స్ జహీరాబాద్ జూన్ 21: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య నేరుగా రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ గ్రామానికి చెందిన భూ బాధితుడు మల్లప్ప పాటిల్ కు నిమ్జ్ భూ సేకరణలో భాగంగా తన పేరున వచ్చిన డెబ్బై వేయిల రూపాయల చెక్కును బాధిత రైతు ఖాతాలో జమ చేయడానికి రెవెన్యూ అధికారి లంచం అడిగినట్లు తెలిసింది. అందులో భాగంగా మల్లప్ప అనే రైతు నుండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య గంగ్వార్ కూడలి వద్ద నేరుగా రూపాయలు డెబ్బై (70) వేయిలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వివరిస్తామని ఎసిబి అధికారులు తెలిపారు.