సిద్దిపేట టైమ్స్ వార్త కు స్పందన అక్రమ మట్టి దందా పై కోరడా
మట్టి రవాణా చేస్తున్న హిటాఛి,టిప్పర్లను పట్టుకున్న అధికారులు
సిద్దిపేట టైమ్స్ తూప్రాన్ /మనోహరాబాద్ :-
అక్రమంగా మట్టిని తరలిస్తున్న మట్టి టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు.మంగళవారం సిద్దిపేట టైమ్స్ పత్రిక లో ప్రచురితం అయిన “అడ్డు అదుపు లేని అక్రమ మట్టి దందా” వార్తకు అధికారులు స్పందించారు.మనోహరాబాద్ మండల పరిధిలోని కొండాపూర్ పారిశ్రామిక ప్రాంతం లో అక్రమ మట్టి దందా నిర్వహిస్తుండగా ఆ ప్రాంతానికి రెవిన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది తో కలిసి చేరుకుని మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ లను,ఇటాచి లను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.గత కొన్ని రోజుల క్రితం అక్రమ మట్టి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టినా మట్టి రవాణా దారులలో మార్పు రాలేదు.ఎట్టకేలకు అధికారులు వార్త కథనాలకు స్పందించి చర్యలకు దిగడం తో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మట్టి రవాణా పై అధికారులు రాజకీయ ఒత్తిడిలకు బయపడి చర్యలకు వెనకడుగు వేస్తుండడం వాల్టా చట్టాలను విస్మరించడమే అవుతుంది. పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తారా లేక రాజకీయ ఒత్తిడికి తలోగ్గి వదిలేస్తారా అనే అనుమానం కలుగుతుంది.
Posted inతాజావార్తలు తెలంగాణ సంగారెడ్డి
సిద్దిపేట టైమ్స్ వార్త కు స్పందన అక్రమ మట్టి దందా పై కోరడా
