దమ్ముంటే రాజీనామా చేయండి..? కాంగ్రెస్ నాయకులకు సవాల్..
ఆరోపణలు మాని, మీ హామీలు చెప్పండి..150 కోట్ల అభివృద్ధి పనులు ఆపితే స్పందించ లేదు..
బిఆర్ఎస్ యూత్ నాయకుల మండిపాటు..
సిద్దిపేట టైమ్స్ డెస్క్ :
మీ స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీ మారిన మీరు అవినీతిపై ఆరోపణలు చేయడం నిజంగా సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు రజినీకాంత్ రెడ్డి, నాయకులు సాయి ప్రేమ్ లు మండిపడ్డారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట అభివృద్ధిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కౌన్సిలర్లకు సవాల్ విసిరారు.
భూ కబ్జాలు చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిన మీరు… అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లినట్లు ఉందని అన్నారు. అవినీతి భూ కబ్జా లు చేసింది మీరు.. మీ లాంటి వారి వాళ్లు పోవడం మా పార్టీ కి దరిద్రం పోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన మీరు.. మీకు చేతనైతే కౌన్సిలర్ పదవి రాజీనామా చేసి, మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
మీరు మాట్లాడాల్సింది అవినీతి ఆరోపణలు కాదు.. మీ కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీ ల గురించి అన్నారు. సిద్దిపేటలో 150 కోట్ల అభివృద్ధి పనులను మీ ప్రభుత్వం ఆపితే స్పందించరా అని ప్రశ్నించారు. సిద్దిపేట లో వెటర్నరీ కళాశాల, శిల్పారామం, రంగనాయక సాగర్ పనులతో పాటు సిద్దిపేటలో 150 కోట్ల అభివృద్ధి పనులు ఆపితే ఎవరు నోరు మెదపలేదు.. మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ఆరోపణలు మాని, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు, జువ్వన కనకరాజు, బెల్లంకొండ వెంకట్, దారిపల్లి శీను, చాంద్, బషీద్ తదితరులు పాల్గొన్నారు