వైభవంగా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం
ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి లో హుస్నాబాద్ ఎల్లమ్మ బోనాలు ప్రారంభమై మళ్ళీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రభుత్వం పక్షాన ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, హుస్నాబాద్ నాయకులు, ప్రజలు భక్తులకు ఆతిధ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతున్నారని, భక్తులు బోనాలు ,పట్నాలు , ఒడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ ప్రాంత ప్రజలకు అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని, కొంగు బంగారం గా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందన్నారు.
కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మ కీ చరిత్ర ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.