బాలాజీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఏడున్నర కేజీల కంతి తొలగింపు…..
సిద్దిపేట టైమ్స్ రామాయంపేట:
మెదక్ జిల్లా రామాయంపేట లోఅరుదైన శస్త్ర చికిత్స చేసి డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలోనీ టీం ఏడున్నర కేజీల కంతిని తొలగించారు. రామయంపేట పట్టణానికి చెందిన పుట్టి యశోద అనే మహిళ గత ఆరు నెలల నుండి కడుపు నొప్పితో బాధపడుతుండగా స్థానిక బాలాజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా కడుపులో కంతితో బాధపడుతుంది అని పరీక్షల నిర్ధారణ ద్వారా తెలిసింది. స్థానిక బాలాజీ హాస్పిటల్ లో సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్, అనస్తీషియన్ డాక్టర్ రాఘవేంద్ర నేతృత్వంలో శనివారం శస్త్ర చికిత్స నిర్వహించి ఏడున్నర కేజీల కంతిని తొలగించారు. తొలగించిన కంతిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు పంపించారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వడం పట్ల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. రామరాజు, యశోద భర్త స్వామిలు ఆనందం వ్యక్తం చేశారు.
Posted inతాజావార్తలు తెలంగాణ మెదక్
అరుదైన శస్త్ర చికిత్స.. ఏడున్నర కేజీల కంతి తొలగింపు..
