హుస్నాబాద్ శివారులో అసాంఘిక కార్యకలాపాల అడ్డాల తొలగింపు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు….ఏసిపి సతీష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని సబ్ స్టేషన్ ప్రధాన రహదారి సమీపంలో చిరు వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో మంగళవారం చిరు వ్యాపార కేంద్రాలను ఏసిపి సతీష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి తొలగించారు. అసాంఘిక కార్యకలాపాల విషయమై ప్రజల నుండి కంప్లైంట్ లు రావడంతో మున్సిపల్ కమీషనర్ మరియు అధికారులతో కలిసి ఏసిపి సతీష్, హుస్నాబాద్ సిఐ, ఎస్ ఐ లు అక్కడికి వెళ్లి వాటిని తీసి వేయించారు. అక్కడ ఉన్న స్థానికులకు కౌన్సిలింగ్ నిర్వహించి, మరొకసారి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, హుస్నాబాద్ ఏసీబీ సతీష్, సిఐ శ్రీనివాస్, ఎస్ ఐ మహేష్ పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.