శ్రీరాంసాగర్ వరద కాలువ, గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ పూర్తి చేయుటకు నిధులు విడుదల చేయండి
ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలి
సిఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
హుస్నాబాద్, భీమదేవరపల్లి, గంగాధర, సిరిసిల్ల మెట్ట, కరువు ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగు నీరు అందించాలనే ప్రజా పోరాటం 1980 లొ ప్రారంభం అయిందని అ ఉద్యమం ప్రాధాన్యతను గుర్తించిన అనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జనగామలో జరిగిన బహిరంగ సభలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి మధ్య కాలువ చెపట్టి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించినారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు.
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా వరద కాలువకు ఇందిర కాలువగా నామకరణం చేసారని శ్రీ రాం సాగర్ వరద కాలువలో బాగంగా గౌరవెల్లి, గండిపెల్లి, తోటపెల్లి లిఫ్టు కెనాల్ కు 2007 చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని అనివార్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ పిదప తోటపెల్లి రిజర్వాయర్ రద్దు చేయబడిందని అయితే తోటపల్లి రిజర్వాయర్ నుంచి లిఫ్టు కెనాల్ పనులు 90 శాతం పూర్తి కాబడి మిగతా ఫిన్సింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని గత ముఖ్యమంత్రి కెసిఆర్ వరద కాలువ పనులను ప్రాదాన్యత ఇచ్చి వేగవంతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యం పెంచినందువల్ల 80 శాతం పనులు పూర్తే గూడాటిపల్లి, తేనుగుపల్లే, మాలపల్లే, అనేక గిరిజన తండాలు ముంపుకు గురై పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రైతులకు, ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని గత ఏడాది రిజర్వాయర్ లొ నీళ్ళు నిల్వ చేస్తామని ఆశించిన అమలు కాలేదని నిర్వాసితులకు ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు పూర్తి స్థాయిలో రానందున దిక్కు తోచని స్థితిలో ఉంటు దినదిన గండంగా బ్రతుకులు వెల్లాదిస్తున్నారని చాడ వెంకటరెడ్డి సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినారు.
వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి శ్రీరాం సాగర్ వరద కాలువ, గౌరవెల్లి గండిపెల్లి తోటపెల్లి రిజర్వాయర్ ముంపు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు.

