తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్ తో పాటు 8 మంది అరెస్టు
సిద్దిపేట టైమ్స్ తూప్రాన్ /మనోహరాబాద్ :-
మనోహరాబాద్ మండలం కూచారంలో గ్రామంలోని వెయ్యి గజాల స్థలానికి సంబంధించిన తప్పుడు రిజిస్ట్రేషన్ ఘటనలో తూప్రాన్ సబ్ రిజిస్టార్ రమణ తో సహా మరో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన మల్లవరపు అరుణ్ కుమార్ అనే వ్యక్తి మరో 8 మందితో కలిసి హైదరాబాద్ మోతీనగర్ కు చెందిన సురావజ్జుల సత్యనారాయణ మూర్తి, అతని భార్య స్వాతికి మండలంలోని కూచారం శివారులోని సర్వే నెం. 225, 226లో వెయ్యి గజాల స్థలాన్ని రూ. 80 లక్షలకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారు. నిందితులు హైదరాబాద్ రాంనగర్ కు చెందిన లక్ష్మీ అనే మహిళలకు డబ్బు ఎర చూపి, లక్ష్మి ఆధార్ కార్డు ను దుర్గ గా మార్ఫింగ్ చేసి సత్యనారాయణ అతని భార్య స్వాతి లకు లక్ష్మి చేత రిజిస్ట్రేషన్ చేశారు.కొనుగోలు దారుడు లింక్ డాక్యుమెంట్ కోసం ఆరా తీయగా, అమ్మిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, తాము కొనుగోలు చేసిన ప్లాట్ దగ్గరకు వెళ్ళగా, ఆ స్థలం వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు పిట్ల సాయి కుమార్, వేముల ప్రభాకర్, నంగునూర్ లక్ష్మి, డాక్యుమెంట్ రైటర్ కుమ్మరి బాలకృష్ణ లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
Siddipet district Husnabad lo fake documents prepare please solve the problems