సిద్దిపేట టైమ్స్, వెబెడెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించనున్నారు. కొద్దిరోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.
Posted inతాజావార్తలు తెలంగాణ హైదరాబాద్
Breaking: రామోజీరావు కన్నుమూత
