పట్టణంలోనికి వరుద నీరు రాకుండా కట్టడి చేయాలి ..
డ్రైనేజీ వ్యవస్థను సరిగా నిర్మాణం చేపట్టాలి …
హుస్నాబాద్ పట్టణ బిఆర్ఎస్ నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణం లో ఆదివారం బిఆర్ఎస్ పట్టణ నాయకులు భారీ వర్షానికి మునిగిపోయిన పలు కాలనీలను, మెయిన్ రోడ్డు ను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ..భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లతో పాటు, పలు కాలనీల్లో రోడ్లు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. టౌన్లో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. అందుకనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు..
పట్టణంలో చిన్నగా చినుకు పడగానే పట్టణం లోని రోడ్ల వెంట వరద నీరు ప్రవహించడం దీనికి తోడు నేషనల్ హైవే పనులు ఆలస్యంగా జరుగడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షం పడినప్పుడు పట్టణం లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మీదుగా అధిక నీరు రావడం, అదేవిధంగా నాగారం రోడ్డులో లోతట్టు ప్రాంతంలో కాలనీలు ఉండటం వలన అందులో కొంత వర్షం నీరు పొంగి మెయిన్ రోడ్డు లోకి ప్రవేశించి అక్కడ ఉన్న షాప్ లలోకి వర్షం నీరు చేరుతుంది. పట్టణం లో ప్రతి వార్డు లో డ్రైనేజీ వ్యవస్థను సరిగా నిర్మాణం చేసీ వర్షం నీరు బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పట్టణ బి అర్ యస్ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమము లో బి అర్ యస్ పార్టీ నాయకులు సుద్దాల చంద్రయ్య, పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, ఐలేని మల్లిఖార్జున్ రెడ్డీ, సూరం పల్లి పర్శరాములు తదితరులు పాల్గొన్నారు







