“క్విట్ ఇండియా దినోత్సవం” సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, బ్రిటిష్ అణిచివేత లో అమరులైన వారికి నివాళులు అర్పించారు.

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: “క్విట్ ఇండియా దినోత్సవం” సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం స్వాతంత్ర్య ఉద్యమంలో ‘క్విట్ ఇండియా’ పోరాటంలో బ్రిటిష్ అణిచివేత లో అమరులైన వారికి నివాళులు అర్పించారు. స్వతంత్ర ఫలాలు అందరికీ చేరే విధంగా అందరూ వ్యవహరించాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ రోజు చారిత్రాత్మకమైన దినం..బ్రిటిషర్ల వలస పాలనకు చరమగీతం పాడి.. భారతదేశనికి దాస్యశృంఖాల నుంచి విముక్తి కలిగించి.. జాతీయోద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారి చేతిలో బంది అయిన దేశం నుండి వదిలి వెళ్ళలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహ ఉద్యమంగా ‘క్విట్ ఇండియా ఉద్యమం’ జరిగిందన్నారు.
ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడాని, మన సమస్యలను పరిష్కారం కోసం అలానే వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ఉద్యమ స్పూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని పరిశ్రంభంగా ఉంచుకోవాలి. భారతదేశాన్ని అఖండ భారతదేశం ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో మనందరం బాధ్యత గా శ్రమపడి ముందుకు వెళ్ళాలన్నారు
అనంతరం నాగుల పంచమి సందర్భంగా
హుస్నాబాద్ పట్టణంలోని నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పుట్టలో పాలు పోశారు.
