పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి. పుష్ప-శ్రీవల్లి మీద చిత్రీకరించిన ఈ పాటలో బన్నీ-రష్మిక అదరగొట్టేశారు. ఈ కపుల్ సాంగ్. “సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ” అంటూ శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించింది. మొత్తం ఐదు భాషల్లోనూ ఈ పాటను శ్రేయా ఘోషల్‌యే ఆలపించడం విశేషం. ఇక దేవిశ్రీ ప్రసాద్ అయితే మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఈ మెలొడీ సాంగ్‌కి బన్నీ-రష్మిక తమ స్టెప్పులతో ఆడియన్స్‌ను ఫిదా చేసేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పుష్ప 2 సెకండ్ సింగిల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పాట అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Posted inతాజావార్తలు సినిమా
Pushpa 2: పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్
