ప్రతాప్ రెడ్డీ నీకు దమ్ముంటే మైనంపల్లిని అడ్డుకో.. -డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి..

ప్రతాప్ రెడ్డీ నీకు దమ్ముంటే మైనంపల్లిని అడ్డుకో.. -డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి..

ప్రతాప్ రెడ్డీ దమ్ముంటే మైనంపల్లిని అడ్డుకో..
రాజకీయ బిక్ష పెట్టిన హన్మంతరావుపై విమర్శలా..?
పార్టీ కోసం కష్టపడ్డ ఎలక్షన్ రెడ్డిని కాదని టిడిపి టికెట్ ఇప్పించింది మైనంపల్లి కాదా..
ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్…!
డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి..

సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి

రాజకీయ బిక్ష పెట్టిన మైనంపల్లి హన్మంతరావును మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి విమర్శించడం సిగ్గుచేటని డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం నుండి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన అప్పటి డిసిసిబి చైర్మన్ ఎలక్షన్ రెడ్డిని కాదని 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డికి టిడిపి టికెట్ ఇప్పించిన ఘనత మైనంపల్లికి దక్కుతుందని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న రాజకీయ గురువు హన్మoత రావును విమర్శించడానికి మనసెలా వచ్చిందని నిలదీశారు. మైనంపల్లిని అడ్డుకుంటామని పేర్కొంటున్న ప్రతాప్ రెడ్డికి దమ్ముంటే రావాలని, అక్కడే చూసుకుందామని సవాల్ విసిరారు. గజ్వేల్ నియోజకవర్గానికి రూ 170 కోట్లు మంజూరయ్యాయని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతాప్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ అనుమతి, ఫైనాన్షియల్ సాంక్షన్ చూపించాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రొసీడింగ్ తో మభ్యపెట్టగా, గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రొసీడింగులు ఇచ్చి తప్పుదోవ పట్టించినట్లు ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణంతో సర్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవాల్సిన అప్పటి సీఎం కేసీఆర్ అవేమీ పట్టించుకోలేదని స్పష్టం చేశారు. నిర్వాసితుల త్యాగాన్ని గుర్తించక పోవడంతో బాధితులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ రేకుల షెడ్లలో నివాసముంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతాపరెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని, అందుకుగాను టిడిపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల పరిస్థితిని గుర్తు చేశారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో 806 షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు సిద్ధంగా ఉండగా, స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత కెసిఆర్ సమయం ఇవ్వని కారణంగా నిరుపేద కుటుంబాలకు ఇవ్వలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మామ కేసీఆర్, అల్లుడు హరీష్ ల మధ్య తగువు పెట్టే ప్రయత్నం చేసిన సంఘటన గజ్వేల్ ప్రజలకు తెలిసిందేనని, అప్పుడే ప్రతాప్ రెడ్డి నీచ సంస్కృతిని ప్రజలు అర్థం చేసుకొని తగిన బుద్ధి చెప్పినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆయా మండలాల బాధ్యులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మోహన్, డిసిసిబి మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *