ఉద్యమ గాన కోకిల పురస్కారానికి ప్రజా గాయకుడు నాయకుడు గడిపె మల్లేశ్ ఎంపిక.
హుస్నాబాద్ ప్రాంత కళాకారుల హర్షం.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చే
టివి, రేడియో జానపద యువ గాయకులు ప్రజా నాయకుడు హుస్నాబాద్ కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు గడిపె మల్లేశ్ ను ఉద్యమ గాన కోకిల పురస్కారం ఇచ్చేందుకు ఎంపిక చేసినట్లు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్ యాదవ్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా ఉద్యమ పోరాటాలకు ఆయువు పట్టైనా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులులైన ఇసుక, గుట్టలు, చెట్లు, గ్రానైట్ బొగ్గు, నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పటికి ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ, సంపదను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని ఉత్తర తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ కొరకు తమ సంస్థ ఏర్పాటు చేశామని మేకల చంద్రశేఖర్ అన్నారు.
ఈ నెల12 శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో ఆవిర్భావ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకులకు గాన కొకిల పురస్కారం ఘన సన్మానం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం నుండి ఆకాశావాణి, ఆలిండియా రేడియో, దూరదర్శన్, డిడి యాదగిరి చానల్, గతంలో అనేక ఆడియో క్యాసెట్లు నేడు యూట్యూబ్ లో జానపద గీతాలు పాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా ఉద్యమా నాయకుడు గాయకుడిగా పనిచేసిన
గడిపె మల్లేశ్ ను అందుకే ఈ పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు.
కాగా తనను పురస్కారానికి ఎంపిక చేసిన మేకల చంద్రశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ లకు గడిపె మల్లేశ్ తో పాటు హుస్నాబాద్ ప్రాంతం కళాకారులు వరుకోలు కళా చందర్, నన్నే అజయ్ కుమార్, పిట్టల తిరుపతి, డాక్టర్ తైలద అంజయ్య, గడిపె రవిందర్, కర్కాల శంకర్, పార్నంది రవిందర్, సింగం రమేష్, ఖాత ఎలీషా, నారోజు చంద్రమౌళి, జాల ఆగయ్య, కె.ఎస్ చారి, మోరే బాల మురారీ, గొల్లపల్లి వినోద్, బొనగిరి శ్రీకాంత్, గద్ద సంపత్, మంద రవిందర్ లు కృతజ్ఞతలు తెలిపారు.