హుస్నాబాద్ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు

హుస్నాబాద్ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో బుధవారం రోజు డిపో మేనేజర్ డి సి హెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. మార్చ్,ఏప్రిల్- 2024 మాసానికి సంబంధించి కండక్టర్స్ బెస్ట్ E. P. K., డీజిల్ ఆదా చేసిన డ్రైవర్ల ను మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆదర్శ ఉద్యోగులను అభినందించి ప్రశంసా పత్రం తో పాటు ప్రగతి చక్ర అవార్డు అందజేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందాలని ఉద్యోగులకు సూచించారు. సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతూనే.. అన్ని ప్రాంతాలకు సమయానుకూలంగా నడిపించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ డి. సిహెచ్. వెంకటేశ్వర్లు, డిపో సూపర్ండెంట్  డి. శ్రీధర్, మెకానికల్ సూపరిండెంట్ సామ్యూల్, హుస్నాబాద్ డిపో ఆర్టీసీ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *